![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అంబటి అర్జున్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు. అర్జున్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన భార్య ప్రెగ్నెంట్ అని బిగ్ బాస్ గ్రాంఢ్ లాంఛ్ రోజే చెప్పాడు. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు తన భార్యని మిస్ అవుతున్నానని అర్జున్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. కాగా హౌస్ లో జరిగే ప్రతీ టాస్క్ లో తన వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు అర్జున్.
బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో కూడా తన భార్య హోస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తను చాలా సంతోషించాడు. ఇక హౌస్ లో తన భార్య శ్రీమంతం కూడా కంటెస్టెంట్స్ సెలబ్రేట్ చేసారు. దాంతో అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత హౌస్ లో నుండి గ్రాండ్ ఫినాలే రోజు బయటకు వచ్చిన అర్జున్.. నాగార్జునతో కాసేపు బిగ్ బాస్ అనుభవాలను షేర్ చేసుకున్నాడు. తన భార్య సురేఖకి ఫోటో మెమోరీస్ అంటే చాలా ఇష్టం. ఫోటో షూట్ చేద్దామని ఎప్పుడు అనేది కానీ ఆమె కోరిక తీర్చలేకపోయాను. మెటర్నిట్ షూట్ తీసుకోవాలని ముచ్చట పడింది అది కూడా లేకుండా చేసానని నాగార్జునతో అర్జున్ చెప్పాడు. దాంతో సురేఖని నాగార్జున స్టేజి పైకి పిలిచి.. ఇంతకంటే మంచి అకేషన్ ఏం ఉండదంటు వాళ్ళతో కలిసి ఫోటో తీసుకున్నాడు. దాంతో అంబటి అర్జున్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
అసలు విషయానికొస్తే అర్జున్ భార్య సురేఖ పండంటి ఆడబిడ్డకి ఈ రోజు జన్మనిచ్చింది. అయితే అర్జున్ తనకి అమ్మాయి పుడితే అర్ఖ అని పేరు పెట్టుకుంటామని ముందుగానే చెప్పాడు. ఎందుకంటే అర్జున్ లోనే మొదటి అక్షరం 'అ 'సురేఖ లోని చివరి అక్షరం కలిసి అర్ఖ అని అర్జున్ చాలా సార్లు బిగ్ బాస్ షో లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అమ్మాయి పుట్టడంతో వెల్కమింగ్ అవర్ లవ్లీ బేబీ గర్ల్ అర్ఖ అంటూ తమ హ్యాపీనెస్ ని ఇద్దరు దంపతులు తమ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. కాగా ఇప్పుడు అంబటి అర్జున్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
![]() |
![]() |